అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు ప్రకటించిన ఆ జంట భవిష్యత్‌లో స్నేహితులుగానే ఉంటాం అని అన్నారు. కాని తాజా పరిస్థితులు చూస్తుంటే అవన్నీ అసత్యాలే అని అభిమానులు అంటున్నారు. అందుకు కారణం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత తన మాజీ భర్త నాగ చైతన్యకు విషెస్ చెప్పకుండా పెంపుడు కుక్క బర్త్ డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసి అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడమే.
సమంత దగ్గర హాష్, సాషా అనే రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలను సైతం సెలబ్రేట్ చేస్తుంటుంది. తాజాగా పెంపుడు కుక్క హాష్ మూడో బర్త్ డేని సెలబ్రేట్ చేసింది ఈ భామ. ఈ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన వీడియోని, పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత. ఇందులో హాష్, సాషా స్టైలిష్ ఔట్ఫిట్ ధరించి ఆకట్టుకుంటున్నాయి. వీటి కోసం పెట్ ఫ్రెండ్లీ కేక్స్ సైతం సిద్ధం చేసింది సామ్.
‘నా లిటిల్ బోయ్ త్వరగా పెరుగుతూ.. ఎక్కువ పార్టీ కోసం చూస్తున్నాడు’ అంటూ సమంత తన ఇన్‌స్టాలో రాసుకు రాగా, దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. నాలుగేళ్లు సంసారం చేసిన భర్తకు విషెస్ చెప్పే తీరిక లేదు కాని, కుక్కల బర్త్‌డేలు మాత్రం బాగానే చేస్తున్నావు అంటూ ఫైర్ అవుతున్నారు. కనీసం ఒక ఫ్రెండ్ లాగా కూడా చైతన్యను ట్రీట్ చేయలేకపోయావా సామ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.