Samantha | పెళ్లిలో తాను ధరించిన తెల్లని వస్ర్తాలను నల్లని గౌన్‌గా మార్చుకున్నది సమంత. అవార్డు షో కోసం డిజైనర్ క్రేషా బజాజ్ ఈ గౌన్ని డిజైన్ చేశారు. ఇటీవలే ఈ గౌన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు సమంత, క్రేషా బజాజ్. ఇదిలావుంటే.. ఏ విషయాన్నయినా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడే సమంత.. ఇటీవల పెళ్లి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
పనిలోపనిగా దర్శక, నిర్మాత కరణ్ జోహార్‌ని ఉద్దేశించి ఛలోక్తులు విసిరింది ‘సంతోషంగా లేని వివాహాలకు కారకుడు కరణ్‌జోహార్. అతడి దృష్టిలో వివాహం ఆదర్శవంతమైనది. ఆ భావనను, వివాహ లెహంగాలపై తనకున్న మక్కువను తెరపై చూపిస్తుంటాడు.
చాలామందికి పెళ్లి విషయంలో అపోహకు కారణం అయ్యాడు. అతను పెళ్లిని ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ అంత అందంగా చూపిస్తాడు. కానీ నిజానికి అది ‘కేజీఎఫ్’ లాగా యాక్షన్, డ్రామా, సంఘర్షణలతో నిండివుంటుంది’ అంటూ ఓ వైపు కరణ్‌ని ఆటపట్టిస్తూనే.. మరోవైపు పెళ్లిపై తన విరక్తిని కూడా ప్రకటించింది సమంత.