బుధవారం 03 జూన్ 2020
Cinema - Feb 24, 2020 , 23:22:11

ఎన్టీఆర్‌తో జోడీగా?

ఎన్టీఆర్‌తో జోడీగా?

వివాహానంతరం అగ్ర నాయిక సమంత సినిమాల వేగాన్ని పెంచింది. పాత్రల్లో నవ్యతకు ప్రాముఖ్యతనిస్తూ కథల్ని ఎంపిక చేసుకుంటున్నది. ఇటీవలే ‘జాను’ చిత్రం ద్వారా ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా ఆమె ఎన్టీఆర్‌ సరసన కథానాయికగా ఖరారైనట్లు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే...త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ వేసవిలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. గతంలో త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ బాక్సాఫీస్‌ వద్ద చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తాజా సినిమా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో సమంత కథానాయికగా ఖరారైందని తెలిసింది. గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సమంత ‘అత్తారింటికి దారేది’ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ‘అఆ’ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఎన్టీఆర్‌తో కలిసి  నాలుగు చిత్రాల్లో జోడి కట్టింది. అభినయానికి బాగా స్కోప్‌ ఉన్న పాత్ర కావడంతో చిత్రబృందం సమంత వైపే మొగ్గుచూపిందని చెబుతున్నారు. 


logo