షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలో సల్మాన్‌ఖాన్ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పారితోషికం తీసుకోలేదని సమాచారం. షారుక్‌ఖాన్‌తో ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని రెమ్యునరేషన్ లేకుండానే ఉచితంగా ఈ సినిమాలో నటించాలని సల్మాన్‌ఖాన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. షారుఖ్‌ఖాన్ సరసన దీపికా పదుకునే నటిస్తోంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత షారుఖ్‌ఖాన్ నటిస్తోన్న సినిమా ఇది.