బాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ మూవీ రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ అనుకున్నట్లే ఈ రంజాన్‌కు విడుదల కాబోతోంది. అయితే మే 13న ఒకేసారి అటు థియేటర్లలో ఇటు ఆన్లైన్లో సినిమా రిలీజ్ చేయనున్నట్లు సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. థియేటర్లతోపాటు పే పర్ వ్యూ సర్వీస్ అయిన జీప్లెక్స్‌లో డీటీహెచ్ ఆపరేటర్లయిన డిష్, డీ2హెచ్, టాటా స్కై, ఎయిర్టెల్ డిజిటల్ టీవీలలో రిలీజ్ కానుండటం విశేషం.
ఈ మూవీ ట్రైలర్ గురువారం (ఏప్రిల్ 22) రిలీజ్ కాబోతోంది. దేశంలో కొవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాధే మూవీ మేకర్స్ ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. థియేటర్ లేదా ఇంట్లోనే చూసే అవకాశం దీనివల్ల ప్రేక్షకులకు దక్కనుంది. ఇలాంటి పరిస్థితుల్లో వినూత్న ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉన్నదని సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ అభిప్రాయపడింది.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. అయితే అందరూ థియేటర్లకు వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఇంట్లోనే పే పర్ వ్యూ సర్వీస్‌లో మూవీ చూసే అవకాశం కూడా ప్రేక్షకులకు ఉంటుంది.
The perfect Eid celebration!💥 #Radhe: Your Most Wanted Bhai, releasing simultaneously on multiple platforms worldwide.#RadheThisEid
— Salman Khan Films (@SKFilmsOfficial) April 21, 2021
@BeingSalmanKhan @bindasbhidu @DishPatani @RandeepHooda @PDdancing @ZeeStudios_ @SohailKhan @atulreellife @reellifeprodn @ZeeMusicCompany pic.twitter.com/TzD3s3eLDi