Alizeh Agnihotri | మైత్రీ మూవీ మేకర్స్‌తో సల్మాన్ ఖాన్ మేనకోడలి తెరంగేట్రం.. టీజర్ వైరల్
భారీ ప్రాజెక్ట్స్, వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎదిగింది మైత్రీ మూవీ మేకర్స్. పుష్ప లాంటి పాన్ ఇండియా విజయంతో పాటు 'ఉప్పెన' చిత్రానికి గానూ జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ ( పుష్ప) చరిత్ర సృష్టిస్తే.. ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థగా ప్రత్యేకతని సంపాయించుకుంది.
భారీ ప్రాజెక్ట్స్, వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎదిగింది మైత్రీ మూవీ మేకర్స్. పుష్ప లాంటి పాన్ ఇండియా విజయంతో పాటు ‘ఉప్పెన’ చిత్రానికి గానూ జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే జాతీయ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ ( పుష్ప) చరిత్ర సృష్టిస్తే.. ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థగా ప్రత్యేకతని సంపాయించుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్లో లీడింగ్ ప్రొడక్షన్ హౌస్‌గా వున్న మైత్రీ మేకర్స్ ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మేనకోడలు అలిజే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఫర్రే’ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్ ఇంట్రస్టింగ్ గా వుంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన అలిజే సల్మాన్ మేనకోడలు కావడంతో ఆమె గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆమె మరెవరో కాదు.. సల్మాన్ సోదరి అల్వీరా ఖాన్, ప్రముఖ నిర్మాత అతుల్ అగ్నిహోత్రి కూతురు అలిజే అగ్నిహోత్రి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది నవంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

