Sikandar | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) టైటిల్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం ‘సికందర్’ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. మూవీ లవర్స్, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. సికందర్ షూటింగ్ ఇవాళ ముంబైలో గ్రాండ్‌గా షురూ అయింది.
యాక్షన్ సీన్ షూట్లో భాగంగా ఎయిర్ సీక్వెన్స్ చిత్రీకరణతో షూటింగ్ మొదలైంది. తొలి షెడ్యూల్ జులై మొదటివారానికి పూర్తవనుంది. అనంతరం ఎస్కే 23 షూట్లో జాయిన్ కానున్నాడు ఏఆర్ మురుగదాస్. సికిందర్‌ను 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో సత్యరాజ్ విలన్‌గా నటించనున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్. సముద్ర మట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో ఎయిర్‌క్రాఫ్ట్‌లో సల్మాన్ ఖాన్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు బీటౌన్ సర్కిల్ టాక్.