సల్మాన్‌ఖాన్ నటిస్తున్న తాజా సినిమా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. 2020లో తూర్పు లద్దాక్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తల నేపథ్యం చుట్టూ అల్లిన కథతో ఈ సినిమా రూపొందుతున్నది. మొన్నటిదాకా ఈ సినిమా షూట్లో బిజీగా ఉన్న సల్మాన్‌కు రీసెంట్గా కాస్త సమయం దొరికింది. దాంతో సౌదీ అరేబియాలో జరిగిన ‘రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్’కు హాజరయ్యారాయన. ఈ సందర్భంగా అక్కడ వేదికపై ఆసక్తికరంగా మాట్లాడారు. ‘పాతికేళ్లలో నేను బయట డిన్నర్ చేసింది లేదు. ఇల్లు, లొకేషన్, ఎయిర్‌పోర్టులే ప్రపంచంలో బతికా. మీకు తెలీని విషయం ఏంటంటే.. నేను మీరనుకున్నంత ఆనందంగా లేను.
నా ప్రాణస్నేహితుల్ని పోగొట్టున్నాను. ప్రస్తుతం ‘నా’ అనే ఫ్రెండ్స్ నలుగురే మిగిలారు నాకు.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు సల్మాన్‌ఖాన్. ఇంకా చెబుతూ ‘నేను బిగ్ స్టార్‌ని మాత్రమే కానీ, గొప్ప నటుడ్నైతే కాదు. తోచినట్టు నటిస్తాను అంతే. ఎమోషనల్ సీన్స్‌లో నేను ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారు.’ అంటూ తనపై తానే సెటైర్ వేసుకున్నారు సల్మాన్. అయితే.. సల్మాన్ కామెంట్లపై ఆయన అభిమానులు వేరే విధంగా స్పందిస్తున్నారు. ‘మీరలా మాట్లాడటం తగదు. తెరపై మీరు ఎమోషనల్ అయితే మేం భావోద్వేగానికి గురవుతాం. మీరెంత గొప్ప నటులో ‘భజరంగీ భాయిజాన్’ చూస్తే తెలుస్తుంది.’ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.