బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. సల్మాన్ ఒక్కడే కాదు.. అతని తండ్రి సలీమ్ ఖాన్‌కు కూడా డెత్ వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికలు ఉన్న ఒక చీటీని సల్మాన్‌కు పంపారు. దాన్ని చూసిన సల్మాన్.. వెంటనే బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్‌కు వచ్చిన చీటీలో ‘‘మూసేవాలాకు జరిగినట్లు చేస్తా’’ అని హెచ్చరికలు ఉన్నాయి. ఇటీవల పంజాబ్‌కు చెందిన సింగర్ మూసేవాలాను కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే. వాహనంలో వెళ్తుండగా తుపాకులతో కాల్పులు జరపడంతో.. మూసేవాలా దుర్మరణం పాలయ్యాడు. ఇలాంటి సమయంలో సల్మాన్‌కు ఇలా బెదిరింపులు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.