సల్మాన్‌ఖాన్, రష్మిక మందన్న జంటగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘సికందర్’ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ముంబయిలో ఇటీవలే ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సల్మాన్‌ఖాన్-రష్మిక మందన్న మధ్య వయోభేదం గురించి సల్మాన్‌ఖాన్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ‘మీ ఇద్దరి మధ్య 31 ఏండ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఈ విషయంపై సోషల్‌మీడియాలో కూడా విమర్శలొస్తున్నాయి. వాటిపై మీ సమాధానమేమిటి? అని సల్మాన్‌ను ప్రశ్నించగా..‘మా వయసు గురించి మీకెందుకు ఇంత పట్టింపు ఎందుకో అర్థం కావడం లేదు. రష్మికకు, వాళ్ల నాన్నకు లేని ఇబ్బంది మీకెందుకు? భవిష్యత్తులో రష్మిక పెళ్లి చేసుకొని ఓ పాపను కంటే ఆ పాప కూడా హీరోయిన్ అవుతుంది. అప్పుడు రష్మిక అనుమతి తీసుకొని వాళ్లమ్మాయితో కూడా నేను కలిసి నటిస్తా’ అంటూ సల్మాన్‌ఖాన్ సరదాగా ఇచ్చిన సమాధానంతో సమావేశంలో నవ్వులు పూశాయి.