బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్ తన వ్యక్తిగత రక్షణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ముంబయి పోలీసులు సల్మాన్‌కు వైప్లస్ భద్రతను సమకూర్చారు. మరిన్ని రక్షణ చర్యల్లో భాగంగా సల్మాన్‌ఖాన్ తన ముంబయి నివాసానికి బుల్లెట్‌ఫ్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌కు కొందరు కార్మికులు బుల్లెట్ ఫ్రూఫ్ బ్లూగ్లాస్ను అమర్చుతున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ షూటింగ్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవుట్డోర్ షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సికందర్’ చిత్రంలో నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకురానుంది.