ప్రస్తుతం బాలీవుడ్లో రష్మిక ప్రభ ఓ స్థాయిలో వెలిగిపోతున్నది. ‘యానిమల్’తో యువతరానికి కలల రాణిగా మారిన రష్మిక.. ఆలిండియా రికార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప2’తో స్టార్ హీరోయిన్గా అవరించింది. ఇక ‘ఛావా’తో నటిగా కూడా కితాబులందుకుంది. త్వరలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌తో కలిసి ‘సికిందర్’తో రానుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే.. ఇక రష్మికను బాలీవుడ్లో ఆపటం కష్టమే. ఇటీవల ‘సికిందర్’ షూటింగ్లో సల్మాన్‌తో తన అనుభవాలను మీడియాతో పంచుకున్నది రష్మిక. ‘నేను చిన్నప్పట్నుంచీ సల్మాన్‌ఖాన్ అభిమానిని. ఆయనతో నటించాలనేది నా కల.
ఆ కల ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. లొకేషన్లో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నా. ప్రతి విషయంలోనూ పూర్తి క్లారిటీతో ఉంటారాయన. ఎంత కష్టమైన యాక్షన్ సన్నివేశం చేసినా.. ఆయనలో ఫ్రెష్‌నెస్ మాత్రం తగ్గదు. ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో యాక్టీవ్‌గా కనిపిస్తారు. నా ఆరోగ్యం బాగుండకపోతే ఇంటి నుంచి భోజనం తెప్పించేవారు. ఆయన అంతపెద్ద సూపర్‌స్టార్ ఎందుకయ్యారో కలిసి పనిచేస్తుంటే తెలిసింది.’ అన్నారు రష్మిక మందన్నా. ఇదిలావుంటే.. వీరి ‘సికిందర్’ సినిమా నుంచి మంగళవారం మేకర్స్ ఓ పాటను విడుదల చేశారు. ‘నాచే..’ అంటూ సాగే ఈ పాటలో సల్మాన్, రష్మిక జోడీ చూడముచ్చటగా ఉన్నదని అభిమానులు అంటున్నారట.