Salman Khan | బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (gangster Lawrence Bishnoi) నుంచి వరుస హత్య బెదిరింపులు (death threats) వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కాలంలో సల్మాన్‌కు పలుమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరింపులు వచ్చాయి. దీంతో మహా ప్రభుత్వం సల్లూ భాయ్‌కి Z+ భద్రత కల్పిస్తోంది. సల్మాన్ ఎక్కడికి వెళ్లినా.. వెంట బాడీగార్డ్తోపాటు టైట్ సెక్యూరిటీతో వెళ్తున్నారు. తాజాగా సల్మాన్ తన మాజీ ప్రేయసి (Ex Girlfriend) బర్త్‌డే పార్టీకి కూడా టైట్ సెక్యూరిటీతోనే హాజరయ్యారు.
సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సంగీత బిజ్లానీ (Sangeeta Bijlani) తన 65వ పుట్టిన రోజు వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ బర్త్‌డే పార్టీకి సల్మాన్ సైతం హాజరయ్యారు. Z+ భద్రత, వ్యక్తిగత బాడీగార్డ్‌తో స్టైలిష్ లుక్‌లో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. నేరుగా తన మాజీ ప్రేయసి వద్దకు వెళ్లి బర్త్‌డే విషెస్ తెలిపారు. అనంతరం సంగీత బిజ్లానీ, ఇతర ఫ్రెండ్స్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ ప్రస్తుతం బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ (Battle of Galwan) చిత్రంలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఫస్ట్ పోస్టర్ లుక్‌ను ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ లుక్‌లో ముఖంపై రక్తం, ఇనుప వైర్‌తో ఉన్న కర్రను చేతిలో పట్టుకుని కనిపించారు. గల్వాన్ లోయలో ఇండియా, పాకిస్థాన్ జవాన్ల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంతో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిసింది. గల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు రాళ్లు, బోర్డర్‌ను రక్షించే ఉద్దేశంతో చైనీస్ ఆర్మీతో మన సైనికులు తీవ్రంగా పోరాడారు. ఆ కథాంశంతో ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రాన్ని తీస్తున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ చివరిసారి ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రిలీజైన సికందర్ చిత్రంలో నటించాడు. ఆ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.
Also Read..
Betting Apps Promotion | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. 29 మంది టాలీవుడ్ ప్రముఖులపై ఈడీ కేసు నమోదు
D54 Movie | ‘పోర్ తొళిల్’ దర్శకుడితో ధనుష్ కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్
Prem Kumar | పెయిడ్ రివ్యూస్‌తో తమిళ సినిమాకి దెబ్బ: 96 దర్శకుడి ఆవేదన