D54 Movie | ఇటీవలే కుబేరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తమిళ నటుడు ధనుష్ మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆయన కెరీర్లో 54వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రం D54 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు “Por Thozhil” (పోర్ తొళిల్)తో అనే థ్రిల్లర్‌తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి గణేష్ ఈ సినిమాను నిర్మించబోతుండగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో పత్తి పంట కాళిపోతుండగా ధనుష్ నిలబడి ఉన్నాడు. అతని వెనుక భయంకరమైన మంటలు అలుముకుని ఉన్నాయి. ఈ దృశ్యం సినిమా కథాంశంపై, దాని థీమ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది చాలా ఉత్కంఠభరితమైన, నాటకీయమైన కథతో రాబోతోందని పోస్టర్ సూచిస్తోంది.
ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్ నటి మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు జయరామ్, కె.ఎస్. రవికుమార్, సూరజ్ వెంజరమూడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజ్ వంటి ప్రముఖ నటులు ఇందులో నటించబోతున్నారు. ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా. ఇషారి కె. గణేష్, థింక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
Sometimes staying dangerous is the only way to stay alive.#D54 starring @dhanushkraja – On floors from today. Produced by @Isharikganesh @VelsFilmIntl. A film by @vigneshraja89 💥
A @gvprakash Musical 🎶@ThinkStudiosInd @alfredprakash17 @thenieswar @ksravikumardir… pic.twitter.com/r558oEi3Rx
— Vels Film International (@VelsFilmIntl) July 10, 2025