Meiyazhagan director Prem Kumar | తమిళ చిత్రాలు విడుదలైన తొలి వారంలోనే పెయిడ్ రివ్యూస్ (Paid Reviewers) వాటిని లక్ష్యంగా చేసుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని 96, మెయ్యాళగన్ చిత్రాల దర్శకుడు ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా అసభ్యకరమైన చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇటీవల జరిగిన సౌత్ డైరెక్టర్స్ రౌండ్‌టేబుల్ చర్చలో తెలుగు దర్శకుడు వివేక్ ఆత్రేయ, కన్నడ చిత్రనిర్మాత హేమంత్ రావు, మలయాళ దర్శకుడు క్రిస్టో టోమీలతో కలిసి ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై పెరుగుతున్న వ్యతిరేక ప్రచారం గురించి ఆయన స్పందించారు.
ఒకప్పుడు సినిమా విమర్శకులు ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్నవారు వారికి పూర్తిగా భిన్నంగా ఉన్నారు. వారి లక్ష్యాలు వేరు. వారు ఉపయోగించే భాష, మాట్లాడే విధానం, లక్ష్యంగా చేసుకునే తీరు చాలా అసభ్యకరంగా ఉంటున్నాయని ప్రేమ్ కుమార్ వ్యాఖ్యానించారు. చాలా మంది రివ్యూ ఇచ్చేవాళ్లు తమ స్వంత ఉద్దేశాలతో సినిమా విడుదలైన మొదటి వారంలోనే బాక్స్ ఆఫీస్ వసూళ్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాలో వచ్చే 90 శాతం రివ్యూస్ డబ్బు చెల్లించి చేయిస్తున్నవేనని, ఇది ప్రజలు సినిమా చూడాలా వద్దా అనే నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రేమ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్మాతలు తక్షణమే ఒక నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
“Tamil Cinema is facing a big problem with Negative reviews. Not everyone, but many reviewers are doing with an agenda to pull the film down & target the first week collection. Even honest reviewers don’t have capacity to review a film”
– Premkumar pic.twitter.com/zvegObMPVL— AmuthaBharathi (@CinemaWithAB) July 9, 2025