Betting Apps Promotion | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. 29 మంది టాలీవుడ్ ప్రముఖులపై ఈడీ కేసు నమోదు
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ (Betting Apps Promotion) కేసులోకి ఈడీ ఎంటరైంది. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ సహా 29 మంది సినీ ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదుచేసింది.
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ (Betting Apps Promotion) కేసులోకి ఈడీ ఎంటరైంది. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ సహా 29 మంది సినీ ప్రముఖులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదుచేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల తదితరులపై కేసు నమోదు చేశారు. ఇక సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లలలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి పేర్లు ఉన్నాయి. వీరితోపాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లపై ఈడీ కేసు నమోదుచేసింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే యాంకర్లు విష్ణుప్రియ, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామలను విచారించిన విషయం తెలిసిందే. అదేవిధంగా 19మంది యాప్ ఓనర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ 23, యోలో 247 ఫెయిర్ ప్లే, జీత్‌విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధనిబుక్ 365, మామ247, తెలుగు365, ఎస్365 జై365, జెట్ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్రా365 యజమానులపై కేసులు ఫైల్ అయ్యాయి.
ఈడీ కేసు నమోదుచేసింది వీరిపైనే..
1. రానా దగ్గుబాటి
2. ప్రకాష్ రాజ్
3. విజయ్ దేవరకొండ
4. మంచు లక్ష్మి
5. ప్రణీత
6. నిధి అగర్వాల్
7. అనన్య నాగెళ్ల
8. సిరి హనుమంతు
9. శ్రీముఖి
10. వర్షిణి సౌందరరాజన్
11. వాసంతి కృష్ణన్
12. శోభా శెట్టి
13. అమృత చౌదరి
14. నయని పావని
15. నేహా పఠాన్
16. పాండు
17. పద్మావతి
18. ఇమ్రాన్ ఖాన్
19. విష్ణు ప్రియ
20. హర్ష సాయి
21. బయ్యా సన్నీ యాదవ్
22. శ్యామల
23. టేస్టీ తేజ
24. రీతు చౌదరి
25. బండారు శేషాయని సుప్రీత
26. బెట్టింగ్ యాప్‌ల నిర్వహణ
27. కిరణ్ గౌడ్
28. అజయ్, సన్నీ, సుధీర్ (సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు)
29. యూట్యూబ్ చానెల్ ‘లోకల్ బాయ్ నాని’
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

