Salman Khan | భారతీయ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ మరింత బలపడుతున్న తరుణంలో టాలీవుడ్-బాలీవుడ్ కలయికలో మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబడింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో చేతులు కలపడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనుండగా, అధికారిక ప్రకటన మార్చి 30న వెలువడింది. ఈ ప్రాజెక్ట్‌పై గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లకు తెరదించుతూ స్వయంగా సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. “దిల్, దిమాగ్, జిగర్ సే… ఫ్రమ్ దిస్ ఏప్రిల్” అంటూ చేసిన పోస్టు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ ట్యాగ్‌లైన్ చూస్తుంటే సినిమా యాక్షన్, ఎమోషన్ మేళవింపుగా ఉండబోతుందని స్పష్టమవుతోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దిల్ రాజు తన బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. టాలీవుడ్-బాలీవుడ్ కలయికలో వస్తున్న ఈ మూవీ కోసం ఎక్కడా రాజీపడకుండా హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందించనున్నారు. కో-ప్రొడ్యూసర్లుగా కుల్దీప్ రాథోడ్, రఫీ ఖాజీ వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ముంబైలో భారీ సెట్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను 2027లో భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ తదితర వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
2007లో ‘మున్నా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి , ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’, ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం కొద్దిపాటి సినిమాలే చేసినా, భారీ స్టార్లతో పనిచేసి తన మార్క్ చూపించారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక పూర్తిస్థాయిలో ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. టాలీవుడ్ మేకింగ్ స్టైల్లో సల్మాన్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.