రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మోగ్లీ 2025’ సాక్షి మడోల్కర్ కథానాయిక. ‘కలర్‌ఫొటో’ఫేం సందీప్‌రాజ్ దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మాతలు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ అంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇందులో బండి సరోజ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్ మొదలైంది. ప్రశాంతమైన మోగ్లీ వాతావరణం, తన గర్ల్‌ఫ్రెండ్‌ని టీజ్ చేస్తున్న వ్యక్తికి మోగ్లీ వార్నింగ్ ఇవ్వడం.. బండి సరోజ్ కుమార్ ఆ ప్రాంతానికి పోస్టింగ్‌కు రావడం.. హీరోయిన్ పట్ల ఆకర్షితుడు కావడం.. ఉద్రిక్తతలు పెరగడం.. ఈ అంశాలన్నీ ట్రైలర్లో చూడొచ్చు. చెవిటి, మూగ హీరోయిన్, అసాధారణ యువకుడు, రామాయణం శైలి కథనం ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి ఎం, సంగీతం: కాలభైరవ, నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.