యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్ సంయుక్త నిర్మాణంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్‌ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం.
చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి అని టీజర్లో సాయిచంద్ ఓ విషయాన్ని ప్రస్తావించడం, అదే సమయంలో దీనికి పరిష్కారం ఉందా? లేదా అని సాయిచంద్‌ని ప్రశ్నించగా దీని నుంచి బయటపడటానికి మనకు ఒకే ఒక మార్గం వుందని సాయిచంద్ చెబుతాడు ఇలా పలు పలు ఆసక్తికరమైన ప్రశ్నలను టీజర్ రేకెత్తిస్తుంది. సంయుక్తా మీనన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: సతీష్ బీకేఆర్.