Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్‌బై చెప్పి కావ్య రెడ్డితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ వివాహ వేడుక జరిగింది. ఈ శుభవార్తతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 29న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం సన్నిధిలో ఈ పెళ్లి అట్టహాసంగా జరిగింది. వేదమంత్రాల మధ్య సాయి శ్రీనివాస్ మూడు ముళ్లు వేసి కావ్యను తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, స్నేహితులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
పెళ్లి అనంతరం మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం సినీ, రాజకీయ ప్రముఖులతో కళకళలాడింది. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.రిసెప్షన్‌కు చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, నాగ చైతన్య, కాజల్ అగర్వాల్, గోపీచంద్, శ్రీకాంత్, తరుణ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అలాగే అలీ, నిర్మాత దిల్ రాజు, రాజకీయ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో చిరంజీవి, మోహన్ బాబు వంటి సినీ దిగ్గజాలకు బెల్లంకొండ కుటుంబం పాదాభివందనం చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాయి శ్రీనివాస్ తన పెళ్లి ఫోటోలను పంచుకుంటూ తన భార్యను అభిమానులకు పరిచయం చేశారు. ఆమెను “పవర్ఫుల్” అని అభివర్ణించడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ జంట క్యూట్‌గా కనిపిస్తూ అందరి మనసులు గెలుచుకుంటోంది. ప్రస్తుతం ఈ పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.