‘బేబీ’ఫేం సాయి రాజేష్ కథను అందిస్తూ, మరో నిర్మాత ఎస్కేఎన్తో కలిసి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటల్, గ్లింప్స్ రేపు విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు.
ఓ జంట బీచ్లో నడుచుకుంటూ వెళ్తుండటం, అక్కడే ఉన్న ఓ బండి మీద దిగ్దర్శకుడు కె.బాలచందర్ ఫొటో ఉండటం ఈ సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. పోస్టర్లో కనిపిస్తున్న ఈ జంట ఎవరనే క్యూరియాసిటీ కూడా ఈ పోస్టర్ చూస్తే కలుగుతున్నది. త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు.