సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గార్గి’. ఈ చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఐశ్వర్య లక్ష్మి, రవిచంద్రన్ రామచంద్రన్, గౌతమ్, థామస్ జార్జి ఇతర పాత్రల్లో నటించారు. ఈ నెల 15న ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, తమిళంలో సూర్య 2డీ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను, హీరోలు రానా, నాని విడుదల చేశారు. ఒక స్కూల్ టీచర్ జీవిత ప్రయాణాన్ని ట్రైలర్ చూపించింది. ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ రాత్రి ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను భావోద్వేగంగా తెరకెక్కించినట్లు తెలుస్తున్నది. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి నటన ప్రధానాకర్షణ అవుతుందని చిత్ర బృందం చెబుతున్నారు.