‘కల్కి 2898ఏడీ’లో దీపికా పడుకొనే పోషించిన ‘సుమతి’ పాత్ర చాలా కీలకం. ఓ విధంగా కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రెండో భాగంలో ఆ పాత్ర ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుందట. అయితే.. దీపికాను ఆ సినిమా నుంచి తప్పించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ‘కల్కి 2’లో సుమతిగా ఎవరు కనిపిస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అలియాభట్ ఆ పాత్రకు ఎంపికైనట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు సాయిపల్లవిని తీసుకున్నట్టు తెలిసింది. ఇటీవలే సాయిపల్లవికి దర్శకుడు నాగ్అశ్విన్ పాత్రను వివరించారని, ఆమె కూడా సుమతిగా కనిపించేందుకు ఉవ్విళ్లూరుతున్నదని ఇన్సైడ్ టాక్. కల్కికి జన్మనిచ్చే క్రమంలో సుమతి అనుభవించే కష్టాలు, వాటి చుట్టూ నిండిన పురాణ నేపథ్యమే ఈ సినిమా కథ. మరి ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు
ఆగాల్సిందే.