Sai Pallavi | కస్టడీ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం NC23పై ఫోకస్ పెట్టాడని తెలిసిందే. చందూ మొండేటి డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. Thandel (వర్కింగ్ టైటిల్)తో రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే దానిపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడ్డది. కోలీవుడ్ భామ సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ గీతా ఆర్ట్స్ ఓ వీడియో విడుదల చేసింది. ఇప్పుడీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ముఖం కనిపించకుండా చేసి.. ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. లవ్‌స్టోరీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సాయిపల్లవి-చైతూ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఈ మూవీలో నాగచైతన్య అంతర్జాతీయ సరిహద్దు జలాల వెంబడి పాకిస్థాన్ దళాలకు పట్టుబడ్డ శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం మేకోవర్ మార్చేసుకున్నట్టు ఇన్సైడ్ టాక్. 2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రాబోతున్నట్టు సమాచారం. ఈ మూవీ చైతూ కెరీర్లోనే అత్యధికంగా రూ.70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. లీడింగ్ బ్యానర్ గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కార్తికేయ, సవ్యసాచి, కార్తికేయ 2, ప్రేమమ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూమొండేటి నుంచి వస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇప్పటికే నాగచైతన్య-చందూమొండేటి కాంబినేషన్లో సవ్యసాచి, ప్రేమమ్ సినిమాలు వచ్చాయి. NC23 వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది.
The widely adored and loved lady joins the voyage of #NC23 🌊⛵#ShejoinstheNC23Voyage
Yuvasamrat @chay_akkineni @chandoomondeti #BunnyVas @GeethaArts #KarthikTheda pic.twitter.com/BbEvRDBPHd
— BA Raju’s Team (@baraju_SuperHit) September 19, 2023
మత్స్యకారులతో ముఖాముఖి..
Pictures from the interaction of Yuvasamrat @chay_akkineni with fisherman family#NC23🌊 #NagaChaitanya pic.twitter.com/r8YFf0KQW8
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 3, 2023
Yuvasamrat @chay_akkineni interacting with fisherman in srikakulam 🌊 #NC23 💥#NagaChaitanya @chandoomondeti #BunnyVas pic.twitter.com/5hykOCISNm
— Uday Chaitu (@UdayChaitu9) August 3, 2023
Rugged Yuvasamrat @chay_akkineni landed in Vizag🤙#NC23 🌊🤔 #NagaChaitanya pic.twitter.com/Zs8g42wtrW
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) August 2, 2023