Sukumar – Sai Pallavi | టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. గత 5 ఏండ్లుగా ఈ ప్రాజెక్ట్‌తోనే ట్రావెల్ అవుతున్నాడు సుకుమార్. అల్లు అర్జున్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనంతరం కొన్ని రోజులు గ్యాప్ తీసుకోనున్నాడు సుకుమార్.
అయితే పుష్ప 2 అనంతరం ఈ లెక్కల మాస్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆర్సీ17 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో కథానాయికగా.. సాయి పల్లవిని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్‌తో ఫస్ట్ జోడి కట్టబోతుంది సాయి పల్లవి. కాగా దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.