Love story movie first week collections | నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా తొలి మూడు రోజులు అద్భుతమైన వసూళ్ళు సాధించింది. నాలుగో రోజు కూడా దాదాపు రెండున్నర కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమాకు ఇంత మంచి కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి. దాంతో కేవలం లవ్ స్టోరీ నిర్మాతలు మాత్రమే కాదు.. మిగిలిన వాళ్లు కూడా పండగ చేసుకున్నారు. అందుకే సక్సెస్ సంబరాలు కూడా ఘనంగా చేసుకున్నారు. అయితే ఇంత భారీ వసూళ్లు సాధించినా కూడా ఇప్పటి వరకు బ్రేక్ ఇంకా కాలేదు లవ్ స్టోరీ.
శేఖర్ కమ్ముల సినిమాలకు సాధారణంగానే ఓవర్సీస్లో మంచి గిరాకీ ఉంటుంది. దాంతో అక్కడ ఇప్పటికే లాభాల బాట పట్టింది లవ్ స్టోరీ. దాదాపు 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేసి.. గత రెండేళ్లలో విదేశాల్లో అతి పెద్ద విజయంగా నిలిచింది లవ్ స్టోరీ. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా లక్ష్యానికి చాలా దూరంలో ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల బిజినెస్ చేసింది లవ్ స్టోరీ. ఇప్పటి వరకు వారం రోజుల్లో 26 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. అంటే ఇంకా 6 కోట్ల దూరంలో నిలిచింది.
తాజాగా విడుదలైన సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దాంతో కచ్చితంగా ఈ సినిమా ప్రభావం లవ్ స్టోరీ కలెక్షన్లపై పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ దాటుకుని సెకండ్ వీకెండ్ బాగా పర్ఫార్మ్ చేస్తే లవ్ స్టోరీ క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. పైగా ఏపీలో పరిస్థితులు కూడా లవ్ స్టోరీ కలెక్షన్స్ పై ప్రభావం చూపించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
సాయి పల్లవి లో ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా..
Samantha Akkineni | సమంత లవ్‌స్టోరి సినిమా చూడదట!