Sai Pallavi | టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి తండేల్ (Thandel). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా వస్తోన్న తండేల్లో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తుండగా.. సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవలే వైజాగ్లో షూట్ జరుపుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆన్లైన్లో హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా తండేల్ టీం శ్రీకాకుళంలో సందడి చేసింది. షూట్లో భాగంగా శ్రీకాకుళం వెళ్లిన చైతూ, సాయిపల్లవికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సాయిపల్లవి ఈ చిత్రంలో శ్రీకాకుళం అమ్మాయి సత్యగా నటిస్తుందని తెలిసిందే. చైతూ అండ్ చందూమొండేటి టీం ఇప్పటికే లాంఛ్ చేసిన సత్య మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫిదాలో తెలంగాణ యాసలో అలరించిన సాయిపల్లవి ఇప్పుడికి శ్రీకాకుళం యాసలో మాట్లాడనుండటంతో అభిమానులు, ఫాలోవర్లు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోంది తండేల్. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది. ఇప్పటికే మేకర్స్ తండేల్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు.
Our Queen @Sai_Pallavi92 arrived to Srikakulam for #Thandel Shoot 🌊❤️🔥
.
.#SaiPallavi #saipallavisenthamarai #tamil #love pic.twitter.com/CZEUgmldhS— Saipallavi_Lovestory (@SaipallaviUyire) June 19, 2024