Sai Pallavi | తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామ సాయిపల్లవి (Sai Pallavi). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది సాయిపల్లవి. ఈ బ్యూటీ నటిస్తోన్న తెలుగు చిత్రాల్లో ఒకటి తండేల్ (Thandel). రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వీడియో రూపంలో బయటకు వచ్చింది.
తండేల్ ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్ కొనసాగుతోంది. లొకేషన్‌కు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ తండేల్‌లో శ్రీకాకుళం అమ్మాయి సత్యగా నటిస్తోంది. చైతూ అండ్ చందూమొండేటి టీం ఇప్పటికే లాంఛ్ చేసిన సత్య మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు తెలంగాణ యాసలో అలరించిన సాయిపల్లవి ఇక శ్రీకాకుళం యాసలో మాట్లాడనుండటంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ తెరకెక్కుతుండగా.. గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. తండేల్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తుండగా.. సాయిపల్లవి సత్య పాత్రలో అందరినీ ఇంప్రెస్ చేయబోతున్న ఇంట్రడక్షన్ వీడియో చెప్పకనే చెబుతోంది.
Thandel ♥️ pic.twitter.com/oATGaGvVDV
— Sai Pallavi (@Sai_PallaviFans) June 16, 2024
Ay pilla #SaiPallavi ♥️#Thandel pic.twitter.com/3lACcEJadl
— Sai Pallavi (@Sai_PallaviFans) June 17, 2024