కంటెంట్ నచ్చితే తప్ప క్యారెక్టర్‌కి ఓకే చెప్పని సాయిపల్లవి ఇప్పుడు ఓ ప్రస్టేజియస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అది కూడా సామాన్యమైన సినిమా కాదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ 173వ సినిమా. ‘పార్కింగ్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవలే ఆయన సాయిపల్లవిని కలిసి కథ వినిపించారట. కథ విన్న వెంటనే ఆమె ఓకే అనేశారాట. దీన్ని బట్టి అది ఎంత గొప్ప కంటెంట్ అయ్యుంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇన్నాళ్లూ తన జనరేషన్ హీరోలతోనే నటించిన సాయిపల్లవి.. తొలిసారి రజనీకాంత్ వంటి సీనియర్ హీరోతో నటిస్తుండటం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇందులో సాయిపల్లవి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఆమెతోపాటు వర్సటైల్ డైరెక్టర్ కదిర్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారట. ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. తలైవా ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉండే ఈ మాస్ ఎంటర్టైనర్కి అనిరుధ్ స్వరాలందిస్తున్నారు.