ARI Movie | ‘పేపర్ బాయ్’ లాంటి సున్నితమైన ప్రేమ కథతో అందరినీ మెప్పించిన దర్శకుడు ‘అరి’ అంటూ ఈ వారం ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. నిన్న (అక్టోబర్ 10) విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఆడియెన్స్ నుంచి మౌత్ టాక్ ఇలా అన్నీ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఈ వారం వచ్చిన చిత్రాలన్నింట్లోనూ అరి కాస్త ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. అరికి మంచి ప్రశంసలు లభించడం, ఆదరణ దక్కుతుండటంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చినట్టుగా కనిపిస్తోంది.
ఇక ‘అరి’ సక్సెస్ సాధించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దర్శకుడు జయశంకర్‌ను అభినందించారు. ఏడేళ్ల శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కిందని కొనియాడారు. అరి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అరి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్ని ఆకట్టుకుంటోంది. ఇక అరి చిత్రంలోని కథ, కథనం, ఇచ్చిన సందేశం ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది.
‘అరి’ చిత్రానికి అనూప్ రూబెన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ పరంగానూ మంచి పేరు వచ్చింది. మొత్తానికి అరితో దర్శకుడు జయశంకర్ ద్వితీయ విఘ్నం దాటినట్టుగా చెప్పుకోవచ్చు. అరి సినిమాలోని మాటలు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఓ ట్రాన్స్ లో డైరెక్టర్ జయశంకర్ సీన్ టు సీన్ తీసుకుంటూ వెళ్ళిపోయారని చూసిన ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలో వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలకు అందరూ కనెక్ట్ అవుతున్నారు.