ప్రస్తుతం సాయిదుర్గతేజ్ ‘సంబరాల యేటిగట్టు’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాయిదుర్గతేజ్ కెరీర్లో భారీ చిత్రంగా నిర్మాత నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్నది. రోహిత్ దర్శకుడు. ఇదిలావుంటే.. తాజా సమాచారం ప్రకారం సాయిదుర్గతేజ్ ఓ కొత్త సినిమా ఒప్పుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఈ సినిమాకు దేవకట్టా దర్శకత్వం వహిస్తారట. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘రిపబ్లిక్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఈ తాజా సినిమా ఉండనున్నదని టాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.