Sai Durga Tej | టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన వివాహంపై ఎంతోకాలంగా సాగుతున్న ఊహాగానాలకు స్వయంగా ముగింపు పలికారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, వచ్చే ఏడాదిలో తన పెళ్లి జరగబోతోందని అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదంతో నాకు మంచి సినిమాలు, మంచి జీవితం దక్కాయి. వచ్చే ఏడాదిలోనే నా వివాహం జరుగుతుంది.కొత్త సంవత్సరం దృష్ట్యా, స్వామివారి ఆశీస్సులతో ముందుకు సాగాలని తిరుమల వచ్చినట్లు తెలిపారు.
చాలా రోజులుగా సోషల్ మీడియాలో, ఫ్యాన్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న పెళ్లి వార్తలకు ఆయన మాటలతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి విషయంతో పాటు తన కొత్త సినిమా ‘సంబరాల ఏటి గట్టు’ గురించి కూడా ప్రస్తావించారు.రోహిత్ కేపీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతుంది. భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
“అసుర సంధ్యవేళ మొదలైంది… రాక్షసుల ఆగమనం” అనే పవర్ఫుల్ డైలాగ్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఈ సినిమాతో సాయి తేజ్ మరో మంచి హిట్ దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. మరోవైపు సాయి తేజ్ చేసిన పెళ్లి ప్రకటనతో సోషల్ మీడియా శుభాకాంక్షలతో నిండిపోయింది. చివరకు మా హీరో పెళ్లి ఫిక్స్.. సంబరాల ఏటి గట్టు రియల్ లైఫ్ సాంబరాలు కూడా మొదలయ్యాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా కొత్త సినిమా, కొత్త ఆరంభం, కొత్త జీవితం అన్నీ కలిసి సాయి తేజ్ జీవితంలో కొత్త దశకు శ్రీకారం చుట్టనున్నాయి. వచ్చే ఏడాది పెళ్లి వివరాలు, వధువు గురించి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.