మెగా హీరో సాయిదుర్గా తేజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025’ ఈవెంట్లో పాల్గొన్న తేజ్, అభిమానులతో ముచ్చటించే సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఒక అభిమాని “అల్లు అర్జున్ గురించి మీ అభిప్రాయం?” అని ప్రశ్నించగా, దానిపై తేజ్ స్పందించిన తీరుపై బన్నీ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తేజ్ ఈ ప్రశ్నకు స్పందిస్తూ, “అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియాలోని బిగ్గెస్ట్ హీరోల్లో ఒకరు. చాలా గొప్పోడు అయిపోయాడు” అని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై కొందరు అభిమానులు తేజ్ మాటలలో ఈర్ష్య కనిపించిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
తేజ్‌కి బన్నీంటే ఇష్టం లేదు, మెగా ఫ్యామిలీ వెంటే ఉంటాడు, అభిప్రాయం చెప్పడంలో ఈర్ష్య కనిపించింది అంటూ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం తేజ్ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తూ, ఈ వ్యాఖ్యల్ని ఆయన జెన్యూన్‌గా చేసిన కామెంట్స్ అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలతో వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి. గతంలో జనసేన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు అయిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డికి మద్దతుగా నిలవడం పెద్ద వివాదానికి దారితీసింది. దాంతో మెగా-అల్లు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయని వార్తలొచ్చాయి. అంతేకాదు, అప్పట్లో సాయిధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడన్న వార్తలు వైరల్ అయ్యాయి. అప్పటి నుండి వీరిద్దరి మధ్య సంబంధాలు అంతగా లేవనే ప్రచారం జరిగింది.
అయితే ఇటీవల అల్లు కనకరత్నమ్మ మరణించిన సమయంలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం, ముచ్చట్లు చెప్పుకోవడంతో ఈ కుటుంబాల మధ్య వైరం తగ్గిందని భావించారు. ఈ నేపథ్యంలో తాజాగా తేజ్ బన్నీపై పాజిటివ్ కామెంట్ చేయడాన్ని మెగా ఫ్యాన్స్ పొగుడుతూ ఉంటే, బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఆ వ్యాఖ్యల ఉద్దేశంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇక సాయిధరమ్ తేజ్ మాత్రం ఈ వివాదంపై ఎలాంటి కామెంట్స్ చేయకుండా తన తదుపరి సినిమా సంబరాల ఏటిగట్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్లో తేజ్ 8 ప్యాక్ బాడీతో అదిరిపోయే లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా దసరా బరిలో ఉండాల్సి ఉన్నప్పటికీ, బడ్జెట్ ఇబ్బందుల కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.