మెగా హీరో సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కెపి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక పానిండియా సినిమా తెరకెక్కుతున్నది. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు వసంత. కథలో చాలా కీలకమైన కేరక్టర్ అది.
ఐశ్వర్యలక్ష్మి ఈ పాత్రను పోషిస్తున్నది. శుక్రవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా వసంతగా ఆమె కేరక్టర్‌ని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఐశ్వర్యలక్ష్మి లుక్ భావోద్వేగపూరితంగా ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో వేసి భారీ సెట్లో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతున్నది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిదుర్గతేజ్ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నారని, సాయిదుర్గతేజ్ కెరీర్లోనే చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.