SDT17 | విరూపాక్ష వంటి బంపర్ హిట్ తర్వాత బ్రో సినిమా రిజల్ట్ సాయి ధరమ్ తేజ్‌ను కాస్త నిరాశపరిచింది. మేనమామ పవన్‌తో కలిసి చేసిన బ్రో సినిమా జూలై చివరి వారంలో రిలీజై మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. వీకెండ్లో సాలిడ్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా వీక్ డేస్‌లో కలెక్షన్లు చాలా వీక్ అయిపోయాయి. ఫైనల్‌గా యవరేజ్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సాయి తేజ్ తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు. గౌతమ్ నంద, సీటీమార్ సినిమాలు దర్శకుడు సంపత్‌నందితో కలిసి ఓ ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చింది.
‘SDT17 ‘అంటూ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఎడమ చెవి కింద త్రిషూలం టాటూతో ఉన్న ప్రీ లుక్ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండ ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఆదివారం ఉదయం 8.55 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు గంజాయి శంకర్ అనే పేరును పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. ఇక సాయిధరమ్ తేజ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ఈ సినిమా కీలక షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుందని ఇన్సైడ్ టాక్. సితారా, శ్రీకర స్డూడియోస్‌తో కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తుంది.
A Thundering First High from our #SDT17 will be unveiled TOMORROW at 8:55 AM! 💥
A @IamSampathNandi MASSS MISSILE🔥 @IamSaiDharamTej @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/z4r8ymkG56
— Sithara Entertainments (@SitharaEnts) October 14, 2023