Sai Dharam Tej | షూటింగ్ మూడ్‌లోకి సాయిధరమ్ తేజ్.. కొత్త సినిమా నయా అప్డేట్
విరూపాక్ష, బ్రో సినిమాల సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కొన్ని రోజులుగా రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. తాజాగా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Sai Dharam Tej | రోడ్డు ప్రమాదం తర్వాత పూర్తిగా కోలుకున్న టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు. ఇప్పటికే విరూపాక్ష, బ్రో సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాల సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సాయిధరమ్ తేజ్ కొన్ని రోజులుగా రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయాడు. తాజాగా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాయిధరమ్ తన కొత్త సినిమాపై ఫోకస్ పెట్టాడు.
సంపత్ నంది (Sampath Nandi ) డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ నేడు సెట్స్‌పైకి వెళ్లింది. తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి గంజాయి శంకర్ (Ganjayi Shankar) టైటిల్‌ను ఫిక్స్ చేశారని ఇన్సైడ్ టాక్. జైలు బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది. 2021లో గోపీచంద్ హీరోగా సీటీమార్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు సంపత్ నంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది.
2022లో సంపద్ నంది కథనందించిన ఓదెల రైల్వే స్టేషన్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో విడుదలైంది. హెబ్బాపటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

