Sai Dharam Tej | మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. బైక్ ప్రమాదం అనంతరం పూర్తిగా కోలుకోవడానికి, శారీరకంగా మళ్లీ ఫిట్ అవ్వడానికి తేజ్ కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ గ్యాప్‌కు ముగింపు పలుకుతూ బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం తేజ్ తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంబరాల ఏటి గట్టు చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దాదాపు ఏడాది కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. కథ, పాత్ర, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి అంశంలోనూ తేజ్ కష్టపడుతున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రం విడుదల తర్వాతే తన తదుపరి ప్రాజెక్టులను ప్రారంభించాలని తేజ్ ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఆయన కెరీర్లో కీలక మలుపు కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అభిమానులను మరింత ఉత్సాహపరిచే విషయం ఏంటంటే… తేజ్ చేతిలో ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి. దర్శకుడు సుజీత్‌తో పాటు సందీప్‌తో కూడా కొత్త సినిమాలు చేయనున్నట్లు సమాచారం. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ‘సంబరాల ఏటి గట్టు’ విడుదలైన వెంటనే ఈ కొత్త సినిమాలపై అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశముంది. దీని ద్వారా తేజ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్లాన్‌లో ఉన్నట్టు స్పష్టమవుతోంది.
మూడేళ్లుగా తన కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తేజ్ గుడ్ న్యూస్ చెప్పినట్టే. ఒకేసారి పలు ప్రాజెక్టులతో బిజీ అవుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ‘విరూపాక్ష’ విజయంతో వచ్చిన ఊపు, ఇప్పుడు ‘సంబరాల ఏటి గట్టు’తో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా హిట్ అయితే సాయి ధరమ్ తేజ్ కెరీర్ మరోసారి పీక్స్‌కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి