Sai Dharam Tej | సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా ఓ ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్నది. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘హను-మాన్’ఫేం కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. మంగళవారం సాయిదుర్గతేజ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ‘ఇంట్రూడ్ ఇన్టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ’ అనే ఎక్సయిటింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సినిమా యూనివర్స్‌ని ఆవిష్కరించింది.
దుష్టశక్తుల వల్ల చాలాకాలంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఓ నేల, రక్షకుని రాకకోసం ఎదురుచూస్తుంటుంది. ఫైనల్‌గా వారి నిరీక్షణ ఫలించినట్టు వీడియో చెబుతున్నది. ఈ సినిమా ద్వారా ఓ అద్భుత ప్రపంచాన్ని దర్శకుడు ఆవిష్కరించనున్నట్టు వీడియో ద్వారా తెలుస్తున్నది. స్టన్నింగ్ సెట్స్, కాంప్లెక్స్ వెపన్స్ తయారీ, పాత్రలకోసం నటీనటుల ట్రాన్స్ఫర్మేషన్.. ఇవన్నీ ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తంగా ఫైనల్ ఫ్రేమ్స్‌లో సాయిదుర్గతేజ్ని ధృఢకాయుడిగా ఆవిష్కరించారు. మునుపెన్నడూ చేయని పవర్ఫుల్ క్యారెక్టర్లో సాయిదుర్గతేజ్ నటిస్తున్నారనీ, ఇది లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ అని ఈ వీడియో హింట్ ఇచ్చింది. ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. ప్రైమ్‌షో ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్నది.