‘బలగం’తో అందరి దృష్టినీ ఆకర్షించింది, తెలుగమ్మాయి కావ్య కల్యాణ్‌రామ్. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ అందాలభామ ఓ మెగా ప్రాజెక్ట్‌లో భాగం కానున్నదని ఫిల్మ్ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే.. సాయిధరమ్‌తేజ్ హీరోగా రోహిత్ దర్శకత్వంలో ‘హనుమాన్’ఫేం నిరంజన్‌రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కావ్య ఎంపికైనట్టు తెలుస్తున్నది. అయితే.. అందులో కావ్యను ఎంచుకున్నది కథానాయిక పాత్రకా? లేక ప్రత్యేకపాత్రకా? అనేది తెలియాల్సివుంది. ఈ సినిమాకు ‘సంబరాల యేటిగట్టు’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ నెలలోనే మొదలుకానుంది. ‘బ్రో’ తర్వాత సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.