సాయిచరణ్, ఉషశ్రీ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకుడు. క్రాంతి ప్రసాద్ నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన నిర్మాత కె.ఎల్.దామోదరప్రసాద్, దర్శకుడు మెహర్మ్రేశ్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘ఇట్స్ ఓకే గురు’ ఒక మంత్రం. ఎన్ని సమస్యలు వచ్చినా ఇట్స్ ఓకే అని ముందుకెళ్లిపోతే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. అదే ఈ సినిమాలో చూపించాం. మన మనసుతో మనం వైవా చేసుకుంటే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. కచ్ఛితంగా ఇది మంచి సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారని నా నమ్మకం’ అని దర్శకుడు మణికంఠ ఆశాభావం వ్యక్తం చేశారు. భావోద్వేగాలను అధిగమించడం ఎలాగో ఈ సినిమా చెబుతుందని నిర్మాత క్రాంతి ప్రసాద్ తెలిపారు. ఇంకా హీరోహీరోయిన్లు సాయిచరణ్, ఉషశ్రీ, ఈస్ట్ వెస్ట్ సీఈవో రాజీవ్ కూడా మాట్లాడారు.