రుత్విక్, విశాఖ దీమన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ‘రాజా ది రాజా’. అనిల్ బోయిడపు దర్శకుడు. కె.నిహారిక దాసరి నిర్మాత. జూలై 17న సినిమా విడుదల కానున్నది. మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నది. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. పునర్జన్మ, ప్రేమ, భావోద్వేగాల కలగలుపుగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ చెబుతున్నది.
ఈ సినిమా విడుదల చేస్తుండటం పట్ల మైత్రీ అధినేతలు ఆనందం వెలిబుచ్చారు. గొప్ప అనుభూతినిచ్చే సినిమా ఇదని, సాంకేతకంగానూ ఆకట్టుకుంటుందని హీరో రుత్విక్ నమ్మకంగా చెప్పారు. అందర్నీ అలరించే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని నిర్మాత నిహారిక అన్నారు. హీరో రుత్విక్ ఒదిగిపోయి నటించాడని, టీమ్ సహకారం వల్లే సినిమా బాగా వచ్చిందని దర్శకుడు అనిల్ బోయిడపు అన్నారు.