Samantha Health condition | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హాస్పిటల్ పాలయిందనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఉన్నట్టుండి మధ్యాహ్నం నుంచి ఆమెకు తీవ్ర అస్వస్థత అంటూ ప్రచారం జరగడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అదేంటి నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్న సమంత ఉన్నట్టుండి హాస్పిటల్ పాలవ్వడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు. అసలు ఏమైంది.. ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అంటూ ఆరా తీస్తున్నారు.
సమంతకు అనారోగ్యం అన్న మాట మాత్రం వాస్తవం. కానీ తీవ్ర అనారోగ్యం అనేది మాత్రం అబద్ధం. కొన్ని మీడియా ఛానల్స్ ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపించారు. అలాగే సోషల్ మీడియాలో గోరంతను కొండంత చేసి చూపించారనేది సమంత సన్నిహితుల వాదన. ఆమెకు ఏమీ కాలేదని.. చాలా ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయాన్ని పదే పదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దయచేసి అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దు అంటూ అభిమానులు కోరుతున్నారు. ఒక ఈవెంట్ కోసం కడప వెళ్లిన సమంత.. అక్కడ పని ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత తీవ్రమైన జలుబు, దగ్గు కొద్దిగా జ్వరంతో బాధ పడిన మాట వాస్తవం. దాంతో రిస్క్ తీసుకోకుండా వెంటనే హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ కి వెళ్లి అన్ని టెస్టులు చేయించుకుంది.
సరైన చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె రెస్ట్ తీసుకుంటుంది. అయితే ఆమె అనారోగ్యం పాలైన విషయమై ఒక రోజు ఆలస్యంగా మీడియాకు తెలిసింది. దాంతో తీవ్ర అనారోగ్యం అంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అందుకే వెంటనే రంగంలోకి దిగిన సమంత పీఆర్ టీమ్ అందులో నిజం లేదని కొట్టి పారేసింది. ప్రస్తుతం ఆమె రెస్ట్ తీసుకుంటుందని.. సమంత ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని వాళ్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉంది సమంత.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha : ఇదే చివరిసారి.. మళ్లీ అలా చేయనంటున్న సమంత
Samantha special song | సమంత ఇకపై వరుసగా ఐటం సాంగ్స్ చేయబోతుందా..?
Samantha : నా ఆశలన్నీ అడియాశలయ్యాయి.. మరోసారి విడాకులపై స్పందించిన సమంత
Samantha Hollywood Movie | హాలీవుడ్ ప్రాజెక్టుకు సమంత పేరు రెఫర్ చేసిన హీరో ఎవరు..?