‘కాంతార-2’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది కన్నడ భామ రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ సొగసరి భారీ ఆఫర్లతో బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ ‘డ్రాగన్’, కన్నడంలో యశ్ ‘టాక్సిక్’లో కథానాయికగా నటిస్తున్న ఆమె తాజాగా తమిళంలో అగ్ర హీరో ధనుష్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ధనుష్ తన 57వ చిత్రాన్ని తమిళరస పద్యముత్తు దర్శకత్వంలో చేయబోతున్నారు.
ఇందులో కథానాయికగా రుక్మిణి వసంత్‌ను ఖరారు చేశారు. తమిళంలో ఏస్, మదరాసి చిత్రాలు ఆమెను నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో మంచి బ్రేక్‌నిచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్నదీ భామ. తాజా ఆఫర్‌తో తమిళంలో రుక్మిణి కెరీర్ మలుపు తిరగడం ఖాయమంటున్నారు.