కన్నడ భామ రుక్మిణి వసంత్ వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ ‘కాంతార: చాప్టర్ 1’లో యువరాణి కనకావతి పాత్రలో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ భామ కన్నడంలో యశ్‌తో కలిసి ‘టాక్సిక్’, తెలుగులో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. ఈ సందర్భంగా తాజా ఇన్స్టాగ్రామ్ చిట్‌చాట్‌లో అభిమానులతో ఈ సొగసరి ‘టాక్సిక్’ సినిమా విశేషాలను పంచుకుంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై రానటువంటి వినూత్న కథాంశమిదని, రా అండ్ రస్టిక్‌గా ఉంటుందని చెప్పింది.
‘ఈ కథ ఎన్నో లేయర్స్‌తో కూడుకొని అద్భుతంగా ఉంటుంది. దర్శకురాలు గీతూమోహన్‌దాస్ గొప్ప విజన్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ కథలో హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ కూడా ఉంటాయి.’ అని రుక్మిణి వసంత్ చెప్పింది. ‘కేజీఎఫ్-2’ తర్వాత యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’పై ఇప్పటికే అంచనాలేర్పడ్డాయి. వచ్చే ఏడాది మార్చి 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.