‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకుంది కన్నడ భామ రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఆమె యశ్ ‘టాక్సిక్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ వంటి భారీ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సొగసరి మరో బంపరాఫర్‌ను చేజిక్కించుకున్నట్లు తెలిసింది. రజనీకాంత్ తాజా చిత్రం ‘ధర్మన్- ది డెడ్లీ డాక్టర్’లో ఈ భామ కీలక పాత్రకు ఎంపికైందని చెన్నై ఫిల్మ్‌నగర్ టాక్. కథాగమనంలో ఆమె క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.
‘ధర్మన్’ చిత్రంలో సిమ్రాన్ కథానాయికగా నటిస్తుండగా, రాశీఖన్నా ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. అగ్ర నటుడు కమల్‌హాసన్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నారు.