టాలీవుడ్ భామ రుహానీ శర్మ (Ruhani Sharma) నటిస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ HER Chapter 1. శ్రీధర్ స్వరాఘవ్ రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా న్యాచురల్ స్టార్ నాని ఈ మూవీ టీజర్‌ను లాంఛ్ చేశారు.
6 నెలల సస్పెన్షన్ తర్వాత ఏసీపీ రుహానీ శర్మకు ఉన్నతాధికారి ఓ యువతి మిస్టరీ డెత్ కేసును చేధించే పని అప్పగిస్తారు. అయితే రుహానీ శర్మ కేసు ఎలా చేధించింది.. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నదనేది సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ మూవీలో సినిమా బండి ఫేం వికాస్ వశిష్ఠ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. రుహానీ శర్మ ఏసీపీ పాత్రలో కనిపించనుంది.
ఈ ప్రాజెక్ట్‌లో జీవన్, రవి వర్మ, ప్రదీప్ రుద్ర, సంజయ్ స్వరూప్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డబుల్ అప్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో రఘు సంకురత్రి, దీపికా సంకురత్రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డబుల్ అప్ మీడియా బ్యానర్లో వస్తున్న తొలి సినిమా ఇది. ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తున్నాడు.
HER Chapter 1 టీజర్..
@NameisNani launching our teaser is truly special. Can’t thank him enough for doing this for us. #HER teaser out nowhttps://t.co/Biey70678b@sswaraghav @doubleupmediaa#DeepaSankuratri#RaghuSakuratri #Pavan #VishnuBesi #ChanakyaToorpu@PROSaiSatish#HERChapter1 #HERTeaser pic.twitter.com/Rxk9GGXdBH
— Ruhani Sharma (@iRuhaniSharma) January 18, 2023
ఏసీపీ లుక్‌లో రుహానీ శర్మ..
The intense & intriguing first look of @iRuhaniSharma 's investigative thriller #HER is out now@sswaraghav @doubleupmediaa#DeepaSankuratri#RaghuSakuratri #Pavan #VishnuBesi #ChanakyaToorpu@PROSaiSatish#HERChapter1#HERFirstLook #HER pic.twitter.com/5Xf7AFzotC
— BA Raju's Team (@baraju_SuperHit) December 8, 2022
Read Also : Dhamki | ధమ్కీ నుంచి మావా బ్రో సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్
Read Also : Arjun Das | ఇక నెగెటివ్ పాత్రలు చేయను.. బుట్ట బొమ్మ యాక్టర్ అర్జున్ దాస్ చిట్ చాట్
Read Also : Michael | మైఖేల్ నుంచి ది మ్యాడ్ క్వీన్ అనసూయ భరద్వాజ్ లుక్