RT 76 | దసరా , సంక్రాంతి సమయాలలో టాలీవుడ్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ వేసుకుంటారు. ఈ సారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారగా, వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ పెరిగిపోతుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరు అనిల్ రావిపూడి కాంబోలో ‘మెగా 157’ సంక్రాంతికి బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగ ఓ రాజు కూడా జనవరి 14 న వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వాటితో పాటు విజయ్ ‘జన నాయగన్’ ఎప్పుడో సంక్రాంతికి వస్తున్నాం అని ఎప్పుడో చెప్పారు. ఇక వీరితో పోటీ పడేందుకు మాస్ మహరాజా రవితేజ కూడా సిద్ధమయ్యాడు.
తాజాగా రవి తేజ 76 పేరుతో ఓ ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ సంక్రాంతికి రానున్నట్టు తెలియజేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందబోయే భారీ ఎంటర్ టైనర్ ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సినిమా ఏ జోనర్ లో రూపొందుతుంది, ఇతర నటి నటులు ఎవరు.. టైటిల్ ఏంటి అనే ఏ వివరాలు సీక్రెట్‌గానే ఉంచారు. కానీ పోస్టర్ ను మాత్రం రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ ‘అనార్కలి’ అని ప్రచారం జరుగుతుంది. షూటింగ్ అయితే ఇంకా మొదలు కాలేదు కానీ కాన్ఫిడెంట్ గా పొంగల్ కు వస్తామని చెప్పడంతో చిత్రంపై టీమ్ ఫుల్ క్లారిటీతో ఉందని అర్ధమవుతుంది. . ప్రస్తుతం మాస్ జాతర పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ జూన్ నుంచి ఫ్రీ కానున్నారు.
అనార్కలి చిత్రం భారీ యాక్షన్ ఎపిసోడ్స్, విఎఫెక్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాకపోవడంతో అనుకున్న టైంకిలో రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆడవాళ్ళూ మీకు జోహార్లు తర్వాత కిషోర్ తిరుమల చేస్తున్న మూవీ ఇదే. ఈ మూవీపై రవితేజ చాలా కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. గత కొంత కాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న రవితేజకి భారీ హిట్ ఒకటి అవసరం. మరి ఈ చిత్రం అయిన రవితేజకి కొంత సంతోషాన్ని కలిగిస్తుందా అనేది చూడాలి. ఇక 2026 సంక్రాంతికి నాలుగు సినిమాలు అప్పుడే స్లాట్ బుక్ చేసుకున్నాయి. బాలయ్య అఖండ 2 సెప్టెంబర్ లో రిలీజ్ ఉంటుందని అన్నారు. ఒకవేళ అప్పుడు కనుక మిస్ అయితే.. ఆ సినిమా కూడా సంక్రాంతి ఫెస్టివల్ లో వచ్చే అవకాశం ఉంది. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర లాంటి ప్రయోగాలతో డిజాస్టర్లు చవి చూసిన రవితేజ తిరిగి కమర్షియల్ జానర్లో సినిమా చేస్తున్నాడు.