రాంచరణ్ (Ram Charan), జూ..ఎన్టీఆర్ (Jr NTR), ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం..తొలి రోజు నుంచి ఏదో ఒక రికార్డుతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు చేసింది.
ఆర్ఆర్ఆర్ ఇక జపాన్‌లో కూడా విడుదల కానుంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదల కానున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇప్పటికే మగధీర, బాహుబలి జపాన్ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. మరి ఆర్ఆర్ఆర్ జపనీస్ వెర్షన్‌కు ఎలాంటి స్పందన వస్తుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. జపాన్‌లో ఎన్టీఆర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న టాక్..ఈ చిత్రానికి ఏ స్థాయిలో చూడాలి మరి.
డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటించగా.., ఎన్టీఆర్ కొమ్రంభీంగా నటించాడు. అలియాభట్ సీతగా కనిపించగా..ఉక్రెయిన్ భామ ఒలీవియా మొర్రీస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది.
Delighted to announce that #RRRMovie is releasing in Japan on 21st Oct, 2022. #RRRinJapan pic.twitter.com/YS4eNGYxE5
— RRR Movie (@RRRMovie) July 21, 2022