RRR Movie | ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజైనప్పటి నుంచి ఏదోఒక విధంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. వరల్డ్ వైడ్గా రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. ఇక ఈనెల 21వ తేదీన జపాన్లో కూడా విడుదలైన విషయం తెలిసిందే. సినిమా ప్రొమోషన్స్లో భాగంగా గత వారం జపాన్ వెళ్లిన ఆర్ఆర్ఆర్ టీం తిరిగి భారత్కు తిరుగు పయనమైంది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
దీంతోపాటు విమానం నుంచి హిమాలయ పర్వతాలను ఫొటో తీసిన రాజమౌళి.. వాటిని అభిమానులతో పంచున్నారు. ఈ భూమి మీద అత్యంత ఎత్తైన శిఖరాలను ఇలా చూసినందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. జపాన్ నుంచి ఇండియాకు తిరిగొస్తున్న సమయంలో ఈ ఫొటోలు తీశానని… సుమారు గంటపాటు హిమాలయాలను చూడటం ఆహ్లాదాన్ని అందించిందని పేర్కొన్నారు.
Captured The Mt. Everest (Image 2) from our flight back to India from Japan. Feeling fortunate to have witnessed the highest peak on the planet.🏔️
A delightful experience to see the Himalayas for almost an hour… pic.twitter.com/ksYq9buhwI
— rajamouli ss (@ssrajamouli) October 27, 2022