RRR పోస్టర్ కూడా కాపీ కొట్టారా..స్పూర్తి పొందారా..?

ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా విడుదలవుతుంది అంటే అందులో కథేంటి అని ఎవరూ చూడటం లేదు. ఆ కథ ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు.. సొంతంగా రాసుకున్నారా లేదంటే ఎక్కడ్నుంచైనా ఎత్తుకొచ్చారా అని మాత్రమే చూస్తున్నారు. మరీ ముఖ్యంగా RRR లాంటి ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నా.. లేదంటే అప్ డేట్స్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే నెటిజన్లు మరో పని కూడా పెట్టుకోరు. రిలీజ్ అయితే దాని ఒరిజినల్ ఎక్కడుంది అని వెతికే పనిలో పడతారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది.
తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా పోస్టర్ విడుదలైంది. అక్టోబర్ 13 దసరా కానుకగా ఈ చిత్రం విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. RRR గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. పైగా ఇప్పుడు పోస్టర్ విడుదలైన తర్వాత ఇది కాపీ అంటూ రచ్చ మొదలు పెట్టారు. సాక్ష్యంగా ఘోస్ట్ రైడర్ పోస్టర్ చూపిస్తున్నారు. రెండు పోస్టర్స్ కూడా చూడ్డానికి ఒకేలా ఉన్నాయి.
కొన్ని తేడాలు మినహాయిస్తే ట్రిపుల్ ఆర్, ఘోస్ట్ రైడర్ రెండూ ఒకేలా అనిపిస్తాయి కూడా. 2021లో ట్రిపుల్ ఆర్ వస్తుంటే.. 2007లోనే ఘోస్ట్ రైడర్ విడుదలైంది. చూడ్డానికి కూడా రెండు అలాగే ఉన్నాయి. అక్కడ్నుంచి కాపీ కొట్టారు అనేకంటే కూడా తమ సినిమాకు తగ్గట్లుగా మార్చుకుని చేసారనేది కాదనలేని వాస్తవం. రామ్ చరణ్ గుర్రంపై..ఎన్టీఆర్ బైక్‌పై కనిపిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. మరోవైపు ఘోస్ట్ రైడర్ పోస్టర్ లోనూ ఇదే జరుగుతుంది.
అక్కడ మనుషులను చూపించకుండా ఘోస్టులతో పని కానిచ్చేసారు. 300 కోట్లతో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఘోస్ట్ రైడర్ పోస్టర్ లో గుర్రం, బైక్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇవే కనిపిస్తున్నాయి కదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. రాజమౌళి అక్కడ్నుంచి స్పూర్తి పొందాడని కొందరు చెప్తుంటే.. కాదు కాదు కాపీ కొట్టాడని మరికొందరు వాదిస్తున్నారు. ఎవరేం అనుకున్నా కూడా ట్రిపుల్ ఆర్ పోస్టర్ మాత్రం పిచ్చెక్కిపోతుంది.
ఇవి కూడా చదవండి..
ఇండోనేషియాలో తెనాలి భామ షికారు
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్‌లో స్టిల్స్
'సర్కారు వారి పాట' ఖాతాలో సరికొత్త రికార్డ్
' ఆర్ఎక్స్ 100' భామ స్పెషల్ సాంగ్..!
వరుణ్‌ధవన్ వెడ్డింగ్‌కు తారలు..ఫొటోలు, వీడియో
మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కోరుట్లలో కరోనా కలకలం
- మూడో టెస్ట్ ఎఫెక్ట్.. పింక్ బాల్ మారుతోంది!
- కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఫుట్‌బాల్ లెజండ్ పీలే
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు